ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్తో మంచి ఫామ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, బొమ్మరిల్లు సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
Our Sail ⛵️in Theatres Begins this August 19th 💥#MahaSamudram 🌊
— Ajay Bhupathi (@DirAjayBhupathi) January 30, 2021
Join this Voyage to witness an Epic tale of #ImmeasurableLove❤️#MahaSamduramOnAug19th@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @AKentsOfficial pic.twitter.com/9iwgRZZkGp