టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జరుగుతున్న అందమైన లొకేషన్ల ఫోటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ లోని అందమైన లొకేషన్లలతో మహేశ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. షార్జాలో భూమి, ఆకాశం ఒకదానికోటి తాకుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పరశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.