29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

అభిమాని ఐ లవ్ యూ చెప్తే.. రిప్లై ఇలా ఇచ్చింది

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్ట్ లు వాటికి నెటిజన్ల కామెంట్లు సహజం. కానీ ఆ కామెంట్లకు సెలబ్రిటీలు రిప్లై ఇస్తే మాత్రం అది ప్రత్యేకం. తాజాగా ఇలాంటిదే ఒకటి జరిగింది.


ధనుష్‌, మాళవిక మోహనన్‌ జంటగా ఓ సినిమా వస్తోంది. రీసెంట్ గానే ఆ సినిమా షెడ్యూల్‌ ఒకటి పూర్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ మాళవిక అభిమానులతో పంచుకుంది. “ధనుష్‌.. మీతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ నవ్వులు మిస్‌ అవుతున్నా. తర్వాతి షెడ్యూల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మనిద్దరం మ్యాగీ ప్రేమికులం” అంటూ ట్వీట్ చేసింది. దానికి రిప్లైగా ఓ అభిమాని “ఐలవ్‌యూ మ్యాగీ” అని కామెంట్ చేశాడు. దానికి మాళవిక స్పందిస్తూ.. “మాగీని ప్రేమించేవాళ్లందర్నీ నేను ఇష్టపడతాను” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.

- Advertisement -

Latest news

Related news