29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఈ సినిమా ఎవరెవరు రిజెక్ట్ చేశారో తెలుసా?

యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రదీప్.. వెండితెరపై.. 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మున్నా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమృత అయ్యర్ ప్రదీప్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి జోడీ తెరపై చూడముచ్చటగా ఉంది. అయితే.. ప్రదీప్ కంటే ముందు ఈ సినిమా కథ చాలామంది హీరోల దగ్గరికి వెళ్లిందట. కాకపోతే.. వారంతా రిజెక్ట్ చేశారట. చివరగా ప్రదీప్ హీరోగా తెరకెక్కింది.
దర్శకుడు మున్నా ఈ కథను ముందు హీరో సత్యదేవ్ కు వినిపించాడట. సత్యతో టెస్ట్ షూట్ కూడా చేశారట. కానీ.. అంత బాగా రాకపోవడంతో కథ ఆగిపోయింది. ఆ తరవ్ాత మెగా కాంపౌండ్ హీరోల చుట్టూ తిరిగింది. సాయిధరమ్ తేజ్ ఈ కథను చాలాసార్లు మార్పులు చేయించుకొని మరీ విన్నాడట. కానీ.. ఒప్పుకోలేదు. అల్లు శిరీష్ కూడా కథ విని.. ఆల్ మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అనేలోపే.. సినిమా క్యాన్సిల్ అయింది. చివరి ప్రయత్నంగా ప్రదీప్ ను కలిసి కథ చెప్పాడట. ప్రదీప్ ఒప్పుకోవడంతో 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా మన ముందుంది. నీలి నీలి ఆకాశం పాటతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

- Advertisement -

Latest news

Related news