22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

రిలీజ్‌కు ముందు “మాస్టర్”‌కు బ్యాడ్ న్యూస్

ధియేటర్లు ఓపెన్ అయ్యాక మోస్ట్ అవెయిటెడ్ మూవీగా “మాస్టర్” ట్రెండింగ్‌లో ఉంది. ధళపతి విజయ్, నేచురల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకోసం తెలుగు, తమిళ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తీరా మూవీ రిలీజ్ అయ్యే ఒకరోజు ముందే పెద్ద చిత్ర యూనిట్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. రేపు సినిమా రిలీజ్ అనగా ఈ రోజే పైరసీ సీన్లు లీక్ అయ్యాయి.


లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో విజయ్, విజయసేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న మాస్టర్ మూవీ రేపు(జనవరి 13) రిలీజ్ అవ్వబోతోంది. కానీ ఈ లోపే ఇందులోని కొన్ని సీన్లు పైరసీ అయ్యాయి. ఒకసారి లీక్ అయితే అది ఆగుతుందా.. జనాలు వాటిని వాట్సాప్ స్టేటస్‌ల్లో కూడా షేర్ చేసేశారు. సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ రావడం చూసి డైరెక్టర్ కనగరాజ్ ఎమోషనల్ అయ్యారు.


తన ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు. “సుమారు ఏడాదిన్నర పాటు ఎంతో రిస్క్ చేసి, మాస్టర్ సినిమా ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. పైరసీ ద్వారా లీక్ అయిన సీన్స్‌ను దయచేసి ఎవ్వరూ షేర్ చేయకండి. ఒక్కరోజులో మాస్టర్ మీ ముందుకొస్తుంది.” అంటూ ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...