32.7 C
Hyderabad
Monday, March 1, 2021

ఆచార్య అని ఎందుకంటారో చెప్పేసిన మెగాస్టార్!

మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. పవర్ ఫుల్ లుక్ తో చిరంజీవి చెప్పిన డైలాగులకు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా మార్క్ ఇమేజ్, గ్రేస్ ఆచార్య టీజర్ లో కొట్టొచ్చినట్టు కనిపించాయి. కొరటాల, మెగాస్టార్ కాంబినేషన్ మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలను దర్శకుడు కొరటాల శివ అందుకున్నాడు. టీజర్ లో విజువల్స్, ఎఫెక్ట్స్ చూస్తుంటే.. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.


తనకు పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ తనను ఆచార్య అని ఎందుకంటారో తెలుసా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజర్ ఇంట్రోకు రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆకట్టుకున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్ కి హాజరయ్యాడు కూడా. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడట.

- Advertisement -

Latest news

Related news