ఆచార్య టీజర్ కోసం అభిమానులే కాదు. మెగాస్టార్ చిరంజీవి కూడా వెయిట్ చేస్తున్నారట. నువ్వు వదలకపోతే నేనే లీక్ చేస్తా అంటూ ఫన్నీగా మీమ్ చేశారు మెగాస్టార్.
ఈ రోజు పది గంటలకు ఆచార్య టీజర్ రిలీజ్ అవుతుందని.. ఫన్నీగా మీమ్ రూపంలో ప్రకటించారు చిరు. తర్వాత కొరటాల అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు.
మెగాస్టార్ మీమ్ ఇదే
చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు.. ఇంకెప్పుడు..
కొరటాల: సార్.. అదే పనిలో ఉన్నా..
చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే.. లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నా..
కొరటాల: రేపు మార్నింగే అప్డేట్ ఇస్తా.. సార్..
చిరంజీవి: ఇస్తావా..
కొరటాల: రేపు మార్నింగ్ 10 గంటలకు ప్రకటన.. ఫిక్స్ సార్
ఇంటర్నెట్ లో మెగా స్టార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు అభిమానులు షాక్ అవుతున్నారు.
So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021
#Acharya pic.twitter.com/YdZ84lkXhL