మన ఇండియన్ సినిమాలకు విదేశాల్లో బాగానే క్రేజ్ ఉంటుంది. అయితే అన్ని దేశాల కంటే కూడా జపాన్‌లో మన సినిమాలు బాగా పాపులర్. ముఖ్యంగా రజనీకాంత్ కు జపాన్‌లో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమా రిలీజ్‌కు జపాన్ నుంచి ఇండియా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన మూవీలన్నీ జపాన్‌లో కూడా రిలీజ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్గా మన బాహుబలి కూడా జపాన్‌లో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు తాజాగా.. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్య మీనన్ నటించిన మిషన్ మంగళ్ సినిమా జపాన్‌లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగాన్ని డ్రమాటిక్‌గా తెరకెక్కించిన సినిమా ఇది. 200 కోట్ల వసూళ్లు రాబట్టిన మిషన్ మంగళ్. ఫిబ్రవరి 8న జపాన్‌లో 40 థియేటర్లలో విడుదల అవ్వబోతోంది. మరి ఈ సినిమా జపాన్ ఆడియెన్స్‌ను ఎంతగా అలరిస్తుందో చూడాలి.