560కి పైగా సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తాజాగా దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న దీనికి ‘సన్ ఆఫ్ ఇండియా’ పేరు పెట్టారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న ఈ సినిమాను అనౌన్స్ చేసారు. తాజాగా జనవరి 29న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
‘ఫస్ట్ లుక్ కోసం చాలా ఎగ్జయిటింగ్ గా వేయిట్ చేస్తున్నాను.. నాన్న’ అంటూ మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ ట్వీటారు.