కరోనా తర్వాత ఆగిపోయిన సినిమాలన్నీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పోయిన రెండువారాల్లో వరుసగా అందరూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫిబ్రవరిలో మనముందుకు రాబోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..?
ఉప్పెన- ఫిబ్రవరి 12

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఉప్పెన సినిమా పోయిన ఏడాది నుంచి ఊరిస్తూ ఉంది. ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్ దగ్గరకు రానే వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ మూవీ విడుదలవ్వబోతోంది.
నాంది-ఫిబ్రవరి 19

కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ.. నిజమైన నటుడు అనిపించుకుంటున్న అల్లరి నరేష్ రీసెంట్ గా నాంది అనే కొత్త సబ్జెక్ట్ తో మనముందుకి రాబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నరేష్ పోస్టర్స్, టీజర్ కొత్తగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది.
కపటధారి-ఫిబ్రవరి 19

విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ.. రెగ్యులర్ ఫార్మాట్ కు కాస్త భిన్నంగా ట్రై చేస్తున్న సుమంత్ ఈ సారి కపటధారిగా రాబోతున్నాడు. గతేడాది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కావలుధారి’ చిత్రానికిది రీమేక్ గా వస్తోంది.ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చెక్-ఫిబ్రవరి 26

టాలీవుడ్ మోస్ట్ అండర్రేటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన చెక్ సినిమాలో నితిన్, రకుల్, ప్రియావారియర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలోకి రానుంది.
ఏ 1 ఎక్స్ప్రెస్-ఫిబ్రవరి 26

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 25 వ సినిమా ‘ఏ 1 ఎక్స్ప్రెస్’ హకీ గేమ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ తో ఆకట్టుకుంది. కొత్త సబ్జెక్ట్ తో డిఫరెంట్ గా ట్రై చేస్తున్న సందీప్ కిషన్ ఈ నెల 26న తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.