18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ముంబై అధికారులు

కోవిడ్-19 సమయంలో కష్టాల్లో ఉన్నవారికి కాదనకుండా సాయం చేసిన రియల్‌ హీరో సోనూసూద్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన నివాస స్థలాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చినందుకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూకు ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్థుల భవనం ఉంది. సదరు భవనానికి బీఎంసీ నోటీసులు పంపించారు. సోనూసూద్ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని బీఎంసీ అధికారుల చెప్పారు.
బీఎంసీ అధికారుల ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం ఎమ్‌సీజెడ్‌ఎమ్‌ఏ(మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కూడా కోవిడ్‌-19 వల్ల ఆలస్యం అవుతుందన్నారు. ఒకవేళ అనుమతులు రాకపోతే దాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తానని చెప్పారు. గతంలోనూ బీఎంసీ అధికారులు బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ విషయంలోనూ ఇలాగే వ్యవహారించి వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. రూ. 48 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బాంద్రాలోని ఆమె ఆఫీసును సగానికి పైగా నేలమట్టం చేయడంతో కంగనా అధికార శివసేన పార్టీ నేతలతో మాటల యుద్ధం చేయడం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

Latest news

Related news

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...