29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నవ్వించడానికి రెడీ అయిన నరేష్

చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ ఓ కామెడీ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా.. గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్న బంగారు బుల్లోడు సినిమా ట్రైలర్ మంగళవారం రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్‏లో పల్లెటూరి వాతావరణం మధ్య జరిగినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా.. కస్టమర్లు దాచిపెట్టుకున్న బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ బంగారు బుల్లోడిగా నవ్విచబోతున్నాడు. ఈ మూవీలో నరేష్‏తోపాటు పృథ్వీరాజ్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‏లు కూడా కామెడీకి రెడీ అయ్యారు. జనవరి 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.

- Advertisement -

Latest news

Related news