29.3 C
Hyderabad
Monday, March 1, 2021

నాలుగు కథలతో ఒకే సినిమా..

సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా.. కథ మాత్రం ఒకటే ఉంటుంది. క్యారెక్టర్లన్నీ ఆ కథ చుట్టూనే తిరుగుతాయి. కానీ నెట్ ఫ్లిక్స్ లో రాబొతున్న పిట్ట కథలు సినిమాలో ఒకటికాదు, నాలుగు కథలుంటాయి. నాలుగు కథలు కలిపి ఒక సినిమాగా మన ముందుకి రాబోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో పిట్టకథలు అనే సినిమా రాబోతోంది. అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదొక ఆంథాలజీ ఫిల్మ్. అంటే ఇది ఒక సినిమా కాదు. నాలుగు కథల సంకలనం. తెలుగులో ఇదొక ఒక కొత్త ఎక్స్‌పరిమెంట్‌.

భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాలుగు కథలు ఉంటాయి. జగపతిబాబు, అమలాపాల్‌, మంచు లక్ష్మి, శృతిహాసన్‌, సత్యదేవ్‌, ఇషారెబ్బా కీలక పాత్రల్ని పోషించిన పిట్టకథలు సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న రిలీజ్ అవ్వబోతోంది. ఆర్‌ఎస్‌పీవీ, ఫ్లయింగ్‌ యూనికార్న్‌ పతాకాలపై రోనీ స్క్రూవాలా, ఆశిదువా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, నందిని రెడ్డి నలుగురు నాలుగు ప్రత్యేకమైన కథలతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మహిళా సాధికారతను, వారు ఎదుర్కొనే సమస్యల్ని చూపించబోతున్నామని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశామని నందినిరెడ్డి చెప్తోంది. ఈ సినిమా అన్ని భాషల వారిని ఆకట్టుకుంటుందని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. నాలుగు కథలు ప్రత్యేకంగా ఉంటూ.. మానవీయ విలువల ప్రధానంగా సాగుతాయని సంకల్ప్‌రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రయోగం తెలుగులో మొదటిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

- Advertisement -

Latest news

Related news