23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

టైటిల్ లేని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనాతో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ తిరిగి పట్టాలెక్కేసరికి.. టాలీవుడ్ లో ఒక్కసారిగా సినిమాల ఊపు మొదలైంది. ఈ మధ్యే సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా బడా సినిమాలు తమ విడుదల తేదీని ప్రకటించాయి. అయితే రీసెంట్ గా మరో మూవీ కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. రిలీజ్ డేట్ అక్టోబర్ 1 అని ప్రకటించింది. మరి ఆ సినిమా పేరేంటో.. హీరోహీరోయిన్లు ఎవరో. ప్రొడ్యూసర్, డైరెక్టర్ లు ఎవరో ఎవరికీ తెలిదు. ఇదే ఇక్కడ మ్యాజిక్.
రీసెంట్ గా విడుదలైన ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. థియేటర్‌లో ఉండే కుర్చీపై కర్చీప్ వేస్తోన్న ఫొటోతో పాటు.. అక్టోబర్‌ 1న విడుదల అనే టైటిల్‌తో కూడిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే ఆ పోస్టర్‌లో ‘సినిమా పేరు లేదు.. హీరో పిక్ లేదు.. హీరోయిన్ ఎవరో తెలియదు.. డైరెక్టర్ పేరు రాయలేదు.. ఒక బ్యానర్ లేదు.. ఫస్ట్ లుక్ వదలలేదు.. ప్రొడ్యూసర్స్ సౌండ్ లేదు.. షూటింగ్ డేట్ ఫిక్స్ అవలేదు.. అందరూ రిలీజ్ డేట్ ఖర్చీఫ్ చేస్తున్నారని ఊరికి ముందే అక్టోబర్ ఒకటి రిలీజ్ అనడమేంటో” అంటూ చుట్టూ టెక్స్ట్ రాసుంది.
అయితే ఈ సినిమా గోపీచంద్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా అని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమా ఏంటో ఎవరిదో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

Latest news

Related news