29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నితిన్ ‘చెక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న  ‘చెక్’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు. ‘ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది’ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతోపాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా.. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

- Advertisement -

Latest news

Related news