29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

అలాంటి పాత్రకు ఒప్పుకున్న నోయెల్ మాజీ భార్య

ర్యాప్ సింగర్, బిగ్ బాస్4 కంటెస్టెంట్ నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా 2019 జనవరి 3న ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. పెళ్లైన మూడు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అదే ఏడాది జూన్ నెల నుంచి దూరంగా ఉంటూ.. గతేడాది సెప్టెంబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే.. నోయెల్ మాజీ భార్య ఎస్తేర్ నొరోన్హా
తాజాగా ఒప్పుకున్న ఓ సినిమాలో వేశ్యగా కనిపించబోతోంది. భీమవరం బుల్లోడు, 1000 అబద్ధాలు, జయ జానకి నాయిక, గుర్రం వంటి సినిమాల్లో నటించిన ఎస్తేర్ ప్రస్తుతంకన్నడ, కొంకిని భాషల్లో బిజీ అయింది. తనకు తెలుగు రాకముందు ఇక్కడ మంచి ఆఫర్లు వచ్చాయని ఇప్పుడు తెలుగు నేర్చుకున్న తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయంటోంది. తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఆమె కోరుకున్నట్టుగానే.. ఈసారి ఓ ప్రమోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక పోర్న్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న హీరోయిన్ అనే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎస్తేర్ పోర్న్ స్టార్‌గా కనిపించబోతుంది.
ఉత్తర చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ఎస్సార్‌ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎస్తేర్ లీడ్ క్యారెక్టర్‌లో బోల్డ్‌గా నటించబోతుంది. క్యారెక్టర్స్ చేయడం కాదు.. చేసిన క్యారెక్టర్‌లో పెర్ఫామెన్స్ ఉండాలి. క్యారెక్టర్‌కి స్కోప్ ఉండాలి.. ఒకటి రెండు సీన్లకు పరిమితం అయ్యే పాత్రల కంటే.. యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నా. ఇలాంటి పాత్రలు చేసినప్పుడే నటిగా నాకు గుర్తింపు వస్తుంది. ఇకపై క్వాలిటీ సినిమాలు, పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యా అంటోంది ఎస్తేర్.

- Advertisement -

Latest news

Related news