32.7 C
Hyderabad
Monday, March 1, 2021

పవన్ భారీ బడ్జెట్ మూవీ.. బడ్జెట్ ఎంతంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత రానాతో కలిసి చేస్తున్న సినిమా ఉంది. దాని తర్వాత క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. అయితే ఈ సినిమా పీరియాడిక్ ఫిల్మ్ గా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది.


పవన్, క్రిష్ కాంబోలో రాబోయే మూవీ.. కోహినూర్ కాలం నాటి నేపథ్యంలోని కథలో ఉంటుందట. ఇప్పటికే ఈసినిమా కోసం భారీ సెట్ లు కూడా వేస్తున్నారని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకున్నారట. కానీ ఇప్పుడు 140 కోట్ల వరకు అవుతుందని టాక్. అయితే పవన్ ఇంత భారీ బడ్జెట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news