29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

పిట్టకథలు ట్రైలర్ రిలీజ్

నలుగురు మహిళలకు చెందిన నాలుగు చిన్న కథల సమూహారంగా తెరకెక్కిన పిట్టకథలు ట్రైలర్‌ను శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రుతీ హాసన్‌, ఈషా రెబ్బా, అమలాపాల్‌, సాన్వే మేఘన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందించిన పిట్ట కథలు వెబ్‌ సిరీస్‌ను తరుణ్‌ భాస్కర్‌, నందిని రెడ్డి, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, లక్ష్మీ మంచు, సంజిత్ హెగ్డే, సత్యదేవ్‌, అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్, కన్నీళ్లు, సీరియ‌స్ స‌న్నివేశాల మేళ‌వింపుతో ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో ఈనెల 19 నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవ్వనుంది.   

- Advertisement -

Latest news

Related news