23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ప్రభాస్ ‘స‌లార్’ షురూ

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ సినిమా మొదలైంది. ఈ మూవీ పూజా కార్యక్రమం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది. కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్రభాస్ తోపాటు హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, ప‌లువురు సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశ‌మున్నట్టు  ప్రచారం జరుగుతోంది.

పూజా కార్యక్రమం

జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సందర్భంగా డైరెక్టర్ చెప్పారు. ‘ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్రభాస్ సార్ కు ధ‌న్యవాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు స్పెషల్ థాంక్స్. స‌లార్ మిమ్మల్ని నిరాశ‌ప‌ర్చదు. మాకు మీ ప్రేమ, మ‌ద్దతు అందివ్వాలి’ అని ఈ సంద‌ర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

- Advertisement -

Latest news

Related news