ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్యాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది.
వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను సంక్రాంతికి చెప్తానని చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికవరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ట్విటర్ లో దర్శకుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కు రెండు సర్ప్రైజ్ లు ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి జనవరి 29న ఒక అప్డేట్, ఫిబ్రవరి 26న మరో అప్ డేట్ కచ్చితంగా ఉంటాయి అని ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
