29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

పవర్‌స్టార్ మూవీ టైటిల్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వకీల్‌సాబ్, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తర్వాత డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తోన్న పీరియాడిక్ ఫిల్మ్ లో నటించనున్నారు.
పవన్, క్రిష్ కాంబోలో వస్తున్న మూవీ పీరియాడిక్ ఫిల్మ్ అవ్వడంతో దానిపైనే అందరి అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ విషయంలో ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు ‘విరూపాక్ష’, ‘హరహర మహాదేవ్’, ‘ఓం శివమ్’, ‘బందిపోటు’ లాంటి టైటిల్స్ వినిపించాయి. అయితే అందులో ‘విరూపాక్ష’ టైటిల్ ను చిత్రయూనిట్ కూడా పరిశీలించింది. కానీ ఈ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో ఇప్పుడు కొత్త టైటిల్ గురించి ఆలోచిస్తున్నారు.
ఈ సినిమా కథను బట్టి.. చిత్రానికి ‘వీరమల్లు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్. యోధుడిగా, వీరత్వానికి ప్రతీకగా నిలిచేలా ‘వీరమల్లు’ టైటిల్‌ ఉంటుందని చిత్రయూనిట్ పరిశీలిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఇందులో జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఔరంగాజేబు క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు.

- Advertisement -

Latest news

Related news