31.5 C
Hyderabad
Monday, March 1, 2021

పూరి-విజయ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ట్రెండీ హీరో విజయ్ దేవరకొండ.. ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్‏ను అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ట్విట్టర్ లో తెలిపారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా పూరీ కనెక్ట్స్ ట్వీట్ చేసింది.

- Advertisement -

Latest news

Related news