29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

‘రాధేశ్యామ్‌’ గ్లిమ్ప్స్‌ వచ్చేది అప్పుడే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న  తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ వాలెంటైన్స్‌ డే కానుకగా ఈ సినిమా గ్లిమ్ప్స్‌ (లఘు వీడియో)ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కన్పించనుంది. 1980లో యూరప్‌ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా నేపథ్యంలో ఈ  సినిమా తెరకెక్కుతోంది. కె.రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news