29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రాజ‘శేఖర్’ ఫస్ట్ లుక్.. హాఫ్ లుక్‌తో అదరగొట్టిండు

సీనియర్ హీరో రాజశేఖర్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. గురువారం (ఫిబ్రవరి 4) రాజశేఖర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మేకర్స్ ప్రత్యేకంగా పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పారు. రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. తెల్ల గెడ్డంతో రఫ్‌లుక్‌లో ఉన్న రాజశేఖర్ ఫొటో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘గరుడవేగ’ విజయం తర్వాత రాజశేఖర్ చేయబోయే ప్రాజెక్టు కావడంతో రాజశేఖర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

‘శేఖర్’ పేరుతో రాబోయే ఈ సినిమాలో రాజశేఖర్ విశ్రాంత పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. రాజశేఖర్ కెరీర్‌లో 91వ సినిమాగా ఈ ‘శేఖర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి లలిత్ దర్శకత్వం వహిస్తుండగా.. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news