29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రజినీకాంత్ ‘అన్నాత్తే’ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘అన్నాత్తే’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇటీవల రజినీ అన్నాత్తే షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. షూటింగ్ సెట్ లో కొందరికి కరోనా పాజిటివ్ తేలడం, ఇదే సమయంలో రజినీ అనారోగ్యం పాలై ఆపై షూటింగ్ అర్ధాంతరంగా ఆపేసీ చెన్నై వెళ్లిపోయారు. దీంతో 2021 సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు నవంబర్ కు వెళ్లిపోయింది. తాజాగా దివాళీ కానుకగా అన్నాత్తే విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ శివ దీన్ని తీస్తున్నారు.  డి ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ ని దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు.

- Advertisement -

Latest news

Related news