రీసెంట్ గా రిలీజ్ అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తి పెంచుతున్న ఉప్పెన టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే.. తాజాగా ఉప్పెన టీజర్ చూసిన రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిల గురించి కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
‘టీజర్ చాలా బాగుంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. చరణ్ ట్వీట్ చూసిన తర్వాత మెగా అభిమానుల్లో ‘ఉప్పెన’ సినిమా పట్ల మరింత ఆతృత పెరిగింది. రామ్ చరణ్ మెచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం విశేషం.
