29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆచార్య కోసం ‘సిద్ధ’మైన రామ్ చరణ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. కొడుకు రామ్‌చరణ్‌ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో రామ్‌చరణ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కొరటాల శివ.. ఆచార్య సెట్స్‌లోకి వెల్ కమ్ రామ్‌చరణ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. ‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ ఒక పోస్టర్ ఇమేజ్ పోస్ట్ చేశారు. అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ అని తెలుస్తుంది.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేజ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ కలిసి నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ఇందులో హీరోయిన్. ఈ సినిమాను సెంటిమెంట్ గా.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ డేట్ మే 9న రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

- Advertisement -

Latest news

Related news