రామ్ ఇప్పుడు ముగ్గురు రామ్లుగా కనిపించబోతున్నాడు. అంటే త్రిపాత్రాభినయం అన్నమాట. రీసెంట్గా వచ్చిన ‘రెడ్’ మూవీలో ద్విపాత్రాభినయం చేసి శభాష్ అనిపించుకున్న రామ్ నెక్స్ట్ ట్రిపుల్ రోల్స్ తో అలరించే అవకాశముందని టాక్ నడుస్తుంది.
ఇస్మార్ట్, రెడ్ సినిమాలతో.. ఇప్పటికే రామ్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలనని నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ లాంటి ప్రయోగాలకు సై అంటున్నాడు.
ఇప్పటు యంగ్ హీరోస్ లో త్రిపాత్రాభినయం చేసిన క్రెడిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు మాత్రమే దక్కింది. అందులో యన్టీయార్ నటుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. మరి రామ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
