మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి పుట్టిన రోజు శుక్రవారం మెగా ఫ్యామిలీ సమక్షంలో నిర్వహించారు. ఇందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, సురేఖ, చిరంజీవి చెల్లెలు వారి ఫ్యామిలీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఫ్యామిలీ సంబంధించిన అరుదైన పాత, కొత్త అరుదైన ఫోటోలను జోడించి రూపొందించిన ఓ వీడియోను తన అభిమానులతో ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు మనవళ్లు, మనవరాళ్లతో తన అమ్మ అంజనాదేవి ఉన్న అరుదైన ఫోటోలు ఉన్నాయి.