టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్,రన అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అందం, అభినయంతో పాటు సక్సెస్ రేట్ కూడా బాగానే ఉండటం వల్ల రష్మిక కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.

‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాతగీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పుష్ప సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే.. ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందాల నటి శ్రీదేవి, సౌందర్యల బయోపిక్ చేయాలని ఉందని.. వారి పాత్ర పోషించాలని ఉందని చెప్పింది. ఈ రెండు తన డ్రీమ్ రోల్స్ అని.. ఆ అవకాశం వస్తే అస్సలు వదులుకోనని తెలిపింది.