32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

న్యూడ్ ఫొటో కావాలంటూ రిక్వెస్ట్.. దిమ్మతిరిగేలా ఆన్సరిచ్చిన పూజాహెగ్డే

సోషల్ మీడీయాలో యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు.. ఓ నెటిజన్ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. ఏమాత్రం తడబడని బుట్టబొమ్మ లౌక్యంగా, ప్రశ్న అడిగిన వాడి దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చింది. వాడి కోరికను తీరుస్తూనే.. మరోసారి ఇలాంటి పని చేయొద్దని హెచ్చరించినట్టుందీ బుట్టబొమ్మ ఆన్సర్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

వరుస సినిమాలతో బిజీగా గడిపే పూజా హెగ్డే తన అభిమానులను కాసేపు పలకరించేందుకు తన ఇన్ స్టాలో లైవ్ చిట్ చాట్ చేస్తోంది. ఇంతలో ఓ నెటిజన్ ‘ నీ న్యూడ్ పోస్టు చేయండి’ అంటూ రిక్వెస్టు పెట్టాడు.  ఊహించని ప్రశ్న ఎదురవ్వడంతో చాకచక్యంగా ఆలోచించిన పూజా.. ఆ నెటిజన్ కి దిమ్మ తిరిగేలా తన కాళ్ల ఫొటో పోస్ట్ చేసి దానికి ‘మై నెక్డ్ పావ్’ అంటూ ఆన్సర్ ఇచ్చి ఆ నెటిజన్ మైండ్ బ్లాక్ చేసింది. ఆ నెటిజన్ పై ఏ మాత్రం కోపగించుకోకుండా.. దిమ్మతిరిగేలా పోస్టు పెట్టిన బుట్టబొమ్మ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’, అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్’ లో సినిమాల్లో నటిస్తుంది.

- Advertisement -

Latest news

Related news