29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తారక్ జోడీ వచ్చేసింది.. జెన్నీ లుక్ అదుర్స్

తారక్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్రలో నటిస్తున్న తారక్ జంటగా ఎవరు అని ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న సమయంలో హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ కొత్త లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ ప్రేయసిగా జెన్నీఫర్ పాత్రలో మోరీస్ కనిపించనున్నారు.
ఈరోజు ఒలీవియా మోరీస్‌ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దాదాపు రూ.400 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ తెర మీద అద్భుతం చేయనున్నారు. అలియా భట్‌ చెర్రీకి జోడీగా సీత పాత్రలో కనిపించగా.. జెన్నీ తారక్ తో జంటకట్టనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్నది.

- Advertisement -

Latest news

Related news