29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ లీక్

ఎన్టీయార్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఇప్పటికే అందరికీ ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మూవీకి సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా రెడీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ పొరపాటున లీక్ అయింది. ఎలాగంటే..
ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ పొరపాటున మూవీ రిలీజ్ డేట్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసిందట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2021, అక్టోబర్ 8న విడుదల కాబోతున్నట్టు అలిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవ్వడంతో కొద్ది సేపటికే ఆమె తన పోస్టును డిలీట్ చేసింది. ఇంకేముందీ.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. మరి చిత్ర యూనిట్ అదే డేట్ ను ఫిక్స్ చేస్తారో లేదో మరి!

- Advertisement -

Latest news

Related news