29.3 C
Hyderabad
Monday, March 1, 2021

మెగా హీరో కొత్త సినిమా ప్రకటన.. ఆసక్తి రేపుతున్న సినిమా పోస్టర్

లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకోగానే.. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ థియేటర్లలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాతో మరిన్ని సినిమాలు విడుదల కావడానికి ఓ ఆశ కల్పించాడు. తాజాగా తేజ్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‏ను జనవరి 25న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు మూవీ కాన్సెప్ట్ పోస్టర్‏ను విడుదల సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.

పోస్టర్ లో కార్ట్ లాంటి రథాన్ని లాగుతున్న కీలు గుర్రాలతో సినిమా మీద పోస్టర్ అంచనాలు పెంచుతున్నది. రథం మీద రెండు జెండాలు.. పోస్టర్ యాంబియన్స్ చూస్తుంటే.. హిస్టరికల్ బ్యాక్ గ్రౌండ్ కథతో వస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‏గా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్‏లో కనిపించనున్నాడట.

- Advertisement -

Latest news

Related news