పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’ ఫస్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇటీవలే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. సలార్ మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన సలార్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు సలార్ ఫస్ట్ షెడ్యూల్ తెలంగాణలోనే షూటింగ్ జరుపుకోనుంది. పెద్దపల్లి జిల్లాలోగల రామగుండంలో యాక్షన్ పార్ట్ తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేశారట. ఇందులో ప్రభాస్ తోపాటు సినిమాలోని ప్రధాన తారాగణం కూడా పాల్గొంటారని సమాచారం.