29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వంద మిలియన్లు దాటిన సర్కారు వారి పాట.. ఏంటో తెలుసా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్, 14 రీల్స్ ప్లస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే.. సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో స్టార్ట్ అయింది.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు అనే సబ్జెక్ట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. లాంగ్ హెయిర్, మెడ మీద టాటూతో మహేష్ బాబు ఈ సినిమాలో కొత్త లుక్ అదిరిపోయింది. అయితే.. మహేష్ బాబు అభిమానులు సర్కారు వారి పాట సినిమాను ఓ రేంజ్ లో ప్రచారం చేసేశారు. ఎంతలా అంటే.. ట్విట్టర్ లో ఏకంగా హ్యాస్ టాగ్ క్రియేట్ అయ్యేంత రేంజ్ లో సర్కారు వారి పాట సినిమాకు క్యాంపెయిన్ చేసేశారు. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తూ.. మిలియన్ల కొద్ది ట్వీట్లతో ఫుల్ పబ్లిసిటీ అవుతోంది. చాలా రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్.. ఏకంగా వంద మిలియన్లకు పైగా ట్వీట్లను అందుకుంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ఈ విషయాన్ని చెప్తూ.. ట్విట్టర్ లో పోస్టర్ షేర్ చేశాడు.

- Advertisement -

Latest news

Related news