29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఆర్‌ఆర్‌ఆర్‌ పై ఫన్నీ సెటైర్..

సంక్రాంతి సందర్భంగా కొన్ని సినిమాల టీజర్లు, మరికొన్ని సినిమాల పోస్టర్లు.. ఇలా ఏదో ఒక అప్‌డేట్ వచ్చింది. అయితే అందరూ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో కొంతమంది ఆర్‌ఆర్‌ఆర్‌పై ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.


ఆర్ ఆర్ ఆర్ ట్విట్టర్ అకౌంట్ పై సుబ్బు అనే ఓ అభిమాని రాజమౌళి కుటీరం పేరుతో ఓ కార్టూన్‌ వేశాడు. రామ్‌చరణ్, ఎన్టీయార్ నిల్చుని ఉండగా.. ఇద్దరు ఆడవాళ్లు ముగ్గులు వేస్తుంటారు. అందులో ‘అక్కా! సినిమా రిలీజ్ ఎప్పుడు’ అని చెల్లి ప్రశ్నించగా.. ‘తప్పమ్మా! తెలియనివి అడగకూడదు’ అని అక్క అంటుంది. ఈ సెటైర్‌పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందిస్తూ.. ‘క్రియేటివిటీతో కొట్టారు. చాలా నచ్చింది. హ్యాపీ సంక్రాంతి’ అని రిప్లై ఇచ్చారు. ఆ కార్టూన్ ఇంకా ట్వీట్.. సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news