23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సలార్‌లో విలన్‌గా సేతుపతి నటిస్తారా?

తెలుగు, తమిళ్ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా బిజీ అవుతున్న విజయ్ సేతుపతికి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ లో విలన్ గా సేతుపతిని అనుకుంటున్నారట. మరి దానికి విజయ్ ఓకే అంటారో.. సారీ అంటారో..
విలక్షణమైన నటనతో.. సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ గా విజయ్ సేతుపతి బిజిగా ఉన్నారు. విజయ్ సహజమైన నటన అందరినీ ఆకట్టుకోవడంతో.. వరుస పెట్టి అవకాశాలొస్తున్నాయి. అందరూ విజయ్ నే కోరుకుంటున్నారు. లేటెస్ట్‌గా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ కు కూడా విజయ్ సేతుపతినే విలన్ గా అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక కమల్ హాసన్ భారతీయుడు 2, అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లాంటి పెద్ద సినిమాలు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మరి సలార్ లోని ఆఫర్ కు ఓకే అంటారా లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -

Latest news

Related news