రెబల్ స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ లో హీరోయిన్ గా శృతి హాసన్ ని అఫిషియల్ గా ప్రకటించారు. ఈమేరకు హోంబలే ఫిలింస్ శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా విషెష్ చెబుతూ.. ‘వెలకం టూ సలార్’ అంటూ ట్విటర్లో శృతి ఫోటోని షేర్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే క్రాక్ తో హిట్ కొట్టిన శృతి, ప్రస్తుతం పవన్ తో వకీల్ సాబ్ లో నటిస్తోంది. త్వరలోనే సలార్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.