సింగర్ సునీత కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసిన ముచ్చట మనందరికీ తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేని తను వివాహం చేసుకోబోతున్నానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అందులో పెళ్లి అనే మాట కంటే కూడా దైవత్వమే తనకు కనిపిస్తుందని కూడా చెప్పింది. ఎలాంటి సందడి లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్దం జరుపుకున్న సునీత తన వివాహాన్ని కూడా కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనుకుంటున్నదట.
ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలన్నారు. కానీ.. వారి జాతకాల ప్రకారం సరైన ముహూర్తాలు లేకపోవడంతో జనవరి 9న పెండ్లి ఫిక్స్ చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు.10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని , జనవరి 9న తమ వివాహం జరగనుందని సునీత తెలిపింది. తనకు మంచి జీవితాన్ని అందించాలని స్వామి వారిని కోరుకున్నాని సునీత పేర్కొంది.