కరోనా సమయంలో తన సమాజసేవతో దేశంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనూ.. తాజాగా ఓ ఫన్నీ వీడియోను పంచుకున్నాడు. ఇటీవల ఆచార్య సినిమా సెట్ లో సోనూసూద్ టైలర్ గా అవతారమెత్తాడు. అక్కడున్న ఓ క్లాత్ ని తీసుకోని ప్యాంట్ కుట్టేందుకు ప్రయత్నించాడు. విఫలం కావడంతో ఆ వీడియోను సరదా కామెంట్ తో తన అభిమానులతో పంచుకున్నాడు. ‘సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఫ్రీగా కుట్టబడును. కానీ ప్యాంట్లు నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు’ అని సోనూసూద్ రాసుకొచ్చారు.