29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నేను తెలుగింటి అల్లుడిని

సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైంలో ఎంతోమంది వలస కూలీలకు సాయం చేసి వాళ్లని సొంత ఊర్లకు పంపే ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత కొంతమంది పేద రైతులకు కూడా తన వంతు సాయం చేశాడు. అయితే సోను సూద్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ ఐయ్యాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అల్లుడు అదుర్స్’ లో నటించాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో సోను సూద్ మాట్లాడుతూ.. ‘నేను తెలుగు వారి అల్లుడినే.. నా భార్య తెలుగు అమ్మాయే’ అంటూ చెప్పుకొచ్చారు. “నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు నేను తెలుగు పరిశ్రమ నుంచే నేర్చుకున్నాను. నా భార్య కూడా తెలుగు ప్రాంతానికి చెందిన ఆమె. అందుకే నేను మీ కుంటుబంలో ఒక్కడిని” అన్నారు.

- Advertisement -

Latest news

Related news