కార్తీ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమా టీజర్ విడుదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. సోమవారం రిలీజయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ టీజర్లో ” మహా భారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపుంటే? అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్” అంటూ కార్తీ చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి.
