సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కపటధారి’ రిలీజ్ డేట్ ని సుమంత్ తన ట్విటర్ ద్వారా ప్రకటించాడు. కన్నడలో సూపర్ హిట్ అయన ‘కావలుధారి’ మూవీకి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ పై డా.ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నారు. ‘చాలా సంవత్సరాల క్రితం జరిగిన హత్యలను ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడో’ తెలపే కథతో ‘కపటధారి’రి తెరకెక్కిస్తున్నారు.