మోసం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. రెండు ప్రోగ్రామ్ లలో పాల్గొంటానని రూ.29లక్షలు తీసుకొని.. మోహం చాటేసి తనను మోసం చేసిందని కేరళ పెరంబవూర్‌కు చెందిన ఆర్.షియాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల తిరువనంతపురంలో టీవీ షో కోసమని సన్నీ లియోన్ వచ్చిన సందర్భంలో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సన్నీ లియోన్ ను ప్రశ్నించి, ఆమె వాంగ్మూలం నమోదు చేశారు.
ఆర్గనైజర్ షియాన్ అన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బాలీవుడ్ బ్యూటీ చెప్పింది. షెడ్యూల్ సరిగా ఫిక్స్ చేయలేదని, తనకు ఇవ్వాల్సిన పైసలను కూడా సకాలంలో చెల్లించలేదని సన్నీఆరోపించింది. ఈవెంట్ మేనేజర్ చేసిన ఆరోపణలు నన్ను బాధించాయి.. దీనిపై నేను అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చానని సన్నీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ ‘స్ల్పిట్స్ విల్లా’ కొత్త సీజన్ షూటింగ్లో భాగంగా తిరువనంతపురంలోనే ఉంది.
ఊరట
ఈవెంట్ మేనేజ్మెంట్ చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ఊరట దక్కింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.