29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆస్కార్ రేసులో సూర్య సినిమా.. ఆనందంలో డైరెక్టర్

సూర్య హీరోగా న‌టించిన త‌మిళ సినిమా సూరారై పొట్రు.. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో నిలిచింది. సుధా కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనరల్ కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం వంటి మరిన్ని కేటగిరీల్లో ఈ సినిమా ఆస్కార్ స్థాయిలో అదరగొట్టేసింది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా అనే టైటిల్‌తో రిలీజై ఘన విష‌యం సాధించిన విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత‌ చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో గోపీనాథ్ పాత్రలో సూర్య పోషించారు.
ఈ సినిమా ఆస్కార్ కు ఎంట్రీ అయిన‌ట్లు ప్రొడ్యూస‌ర్ రాజశేఖ‌ర్ పాండ్యన్ ట్వీట్ చేశారు. బెస్ట్ యాక్టర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ డైర‌క్టర్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్, జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో ఈ సినిమా పోటీ పడుతున్నది. ఆస్కార్ అకాడ‌మీలో త‌మ సినిమా స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించిందని ప్రొడ్యుసర్ ప్రకటించాడు. ఓటీటీలో విడుదలై.. సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం సంతోషించాల్సిన విషయమే అంటున్నారు సినీ విమర్శకులు.

- Advertisement -

Latest news

Related news