29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఫ్యాన్ పెండ్లికి హాజరై.. సూర్య ఏం చేశాడో తెలుసా?

తమిళ ప్రముఖ నటుడు సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆకాశమే హద్దు సినిమాతో.. హిట్ అందుకొని ఊపు మీదున్న సూర్య తన ఫ్యాన్స్ మీద చూపించే ప్రేమకు కూడా ఆకాశమే హద్దు అని చెప్పకనే చెప్పాడు. సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడి పెండ్లికి హాజరై.. దగ్గరుండి తతంగమంతా జరిపించి తన అభిమానిని సంతోషపరిచాడు.

సూర్యకి వీరాభిమాని అయిన హరి.. సూర్య ఫ్యాన్ క్లబ్ లో సభ్యుడు. ఈ మధ్యే హరికి పెండ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ముహూర్తం సమయానికి పెండ్లి మంటపానికి వచ్చాడు. వధువు మెడలో వరుడు కట్టే తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కి అందించాడు. పెళ్లి జరిగే వరకు అక్కడే ఉన్నాడు. వధూవరులను ఆశీర్వదించాడు. తన అభిమాన హీరో తన పెండ్లికి వచ్చి.. పెండ్లి మొత్తం అయ్యేంత వరకు అక్కడే ఉండి దీవించి.. ఫొటోలు దిగి వెళ్లడంతో హరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Latest news

Related news