భారత క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా రూపొందుతున్న ‘శభాష్ మిత్తు’ కోసం స్టార్ హీరోయిన్ తాప్సి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. పాత్రకు జీవం పోసేందుకు ప్రస్తుతం కోచ్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర క్రికెట్ లో శిక్షణ పొందుతుంది. ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో తాప్సి తన ట్విటర్లో షేర్ చేసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చెప్పింది. ‘బ్యాట్, బాల్‌తో రొమాన్స్ చేయనున్నాను’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు రాహెల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.