హైదరాబాద్ శివారులోని కోకా పేటలో వేసిన ఆచార్య సినిమా భారీ సెట్లో జరుగుతున్న సినిమా షూటింగ్ స్పాట్ కు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివతో కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన విశేషాలను మంత్రి ట్విటర్లో షేర్ చేశారు. దాంతోపాటు సంబంధిత ఫొటోలను పంచుకున్నారు. చిరంజీవితోపాటు చిత్ర బృందానికి మంత్రి పువ్వాడ విషెష్ చెప్పారు. ఆచార్య ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.
నిన్న విడుదలైన ఆచార్య సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన వస్తోంది. 1 నిమిషం 7 సెకన్లు ఉన్న టీజర్లో రామ్ చరణ్, హీరోయిన్ కాజల్ ని చూపించలేదు. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా ఆచార్య అని ఎందుకు అంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..?’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది.