29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సమ్మర్ లో సందడి చేసేందుకు వస్తున్నయ్

లాక్‏డౌన్ ఎత్తేసిన తర్వాత కొన్ని నిబంధనతలతో థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా వల్ల ఆగిపోయిన షూటింగ్‏లన్నీ పూర్తిచేసి.. సినిమా పూర్తిచేసే పనిలో పడ్డారు దర్శకులంతా. ఇప్పటికే థియేటర్లలో సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్, రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపించాయి. ఇది ఊపు షూటింగ్ దశలో ఉన్న సినిమాల దర్శకులకు ఊపునిచ్చింది. దీంతో వీలైనంత తొందరగా వారి వారి సినిమాల షూటింగ్ పూర్తి చేసి.. ఈ సమ్మర్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి ఉబలాటపడుతున్నరు. పలు సినిమాల దర్శకులు విడుదల తేదీలను ప్రకటించారు కూడా.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. కరోనా కారణంగా రిలీజ్‏కు వాయిదా పడిన సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల కాబోతుంది. ఈ మూవీ టీజర్‏కు ఇండస్ట్రీలో మంచిస్పందన వచ్చింది. ఇదే జాబితాలో హీరో సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్‏ప్రెస్ మూవీ ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఆది, సాయి కుమార్ నటించిన శశి సినిమాలు వేసవిలో విడుదల కాబోతున్నాయి. రానా నటించిన చిత్రం అరణ్య మార్చి 26న రిలీజ్ కానుండగా.. విరాట పర్వం కూడా సమ్మర్ బరిలో నిలువనుంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న నాగచైతన్య, శేఖర్ కమ్ముల చిత్రం లవ్ స్టోరీ కూడా సమ్మర్లో విడుదల కానుంది. హీరో నితిన్ నటించిన రంగ్ దే కూడా మార్చి నెలలో థియేటర్లలోకి రానుంది. ఏప్రిల్.. మే నెలలో కూడా సినిమాల జోరు తగ్గేలా లేదు. హీరో నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించేశారు. అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా వేసవిలో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో రాబోతున్న వకీల్ సాబ్ కూడా వేసవిలో విడుదల కానున్నాయి. హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా కూడా సమ్మర్లోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

Latest news

Related news